శవాలై తేలిన అదృశ్యమైన ఇద్దరు బాలురు

by Naveena |

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులోని కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు.

శవాలై తేలిన అదృశ్యమైన ఇద్దరు బాలురు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులోని కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. ఎస్సై, గ్రామస్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన తేజావత్​ సాయికుమార్ (16), భూక్యా సురేష్​ (15) అనే ఇద్దరు బాలురు ముత్యంపేట గ్రామంలోని కల్లు దుకాణంలో పనిచేస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం వీరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అయితే గురువారం వీరిద్దరి మృతదేహాలు రాఘవాపూర్​ గ్రామ శివారులోని కుంటలో తేలాయి. కాగా వీరి మృతిపై అనుమానం ఉన్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజు వివరించారు.

Next Story