- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
బైక్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు.

ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
దిశ, నిజామాబాద్ అర్బన్: బైక్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని దేవీ రోడ్ వద్ద పోలీసులు వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తుండగా అటుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు దొంగిలించిన బైక్ పై వస్తూ పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఒవైసీ నగర్ కు చెందిన హనువాతే భీమ్, హనువాతే సుభాష్ లుగా గుర్తించినట్లు తెలిపారు. మధ్యం, జల్సాల కోసమే బైక్ దొంగతనాలు చేస్తున్నట్లు నిందితులు పోలీసుల విచారణలో తెలిపినట్లు పేర్కొన్నారు. భైంసా, నందపేట్, బాల్కొండ, ప్రాంతాల్లో కూడా వారు బైక్ దొంగతనాలు చేశారని, వారి నుండి నాలుగు బైక్ లు స్వాధీనం చేసుకుని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు.
బైక్ చోరీపై ఫిర్యాదు
నిజామాబాద్ బస్‌టాండు వద్ద పార్క్ చేసిన తన బైక్ దొంగిలించబడిందని భూక్య విఠల్ అనే వ్యక్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19 న భూక్య విఠల్ అనే వ్యక్తి తన బైక్ నెం. టిఎస్ 16 ఈఎక్స్ 8578 ను ఆర్టీసీ బస్‌టాండు వద్ద పార్క్ చేసి లోపలికి వెళ్లి తిరిగొచ్చేసరికి బైక్ కనిపించకపోవడంతో వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ఓ తెలిపారు.






