- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ ద్వారా పారదర్శక బదిలీలు
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ రాజేష్ చంద్ర 35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ పద్ధతిలో బదిలీ ప్రక్రియ నిర్వహించారు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ రాజేష్ చంద్ర 35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ పద్ధతిలో బదిలీ ప్రక్రియ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నుండి బదిలీపై వచ్చిన 32 మంది హోం గార్డ్స్ తో పాటు జిల్లాలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న 3 మంది హోం గార్డ్స్‌కు బదిలీలు చేపట్టారు. విల్లింగ్, సీనియారిటీ, స్పౌస్ ప్రాధాన్యత, ఆరోగ్య పరిస్థితులు, రికార్డులను పరిగణలోకి తీసుకొని పూర్తిగా పారదర్శకంగా కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ..హోం గార్డ్స్ అందరూ క్రమశిక్షణతో తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్లలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల మర్యాదతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ఒక్కరి నిర్లక్ష్యం మొత్తం శాఖ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ పనితీరును మెరుగుపరుచుకొని, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఆర్‌ఐలు సంతోష్, నవీన్ కుమార్, కృష్ణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






