- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ః నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన రైతుల పొలాల్లో ఉన్న నాలుగు ట్రాన్స్ ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసారు. ట్రాన్స్ ఫార్మర్లలోని ఆయిల్, రాగి తీగలు, కాయిల్స్ ను దొంగిలించారు. దుండగులు పొలాల వరకు కారులో వచ్చినట్లు తెలుస్తోంది. దుండగులను గుర్తించి పట్టుకోవాలని రైతుల కోరుతున్నారు. దుండగులు ఆగడాలు ఇలాగే కొనసాగితే పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లకు భద్రత లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ల ధ్వంసంతో బోరు మోటర్లు కూడా నడవకుండా, రైతులకు ఇబ్బందులు కలుగుతాయని, తద్వారా పంటలు కూడా సాగు నీరందక ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






