- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకే శిక్షణ : పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య
దిశ, నిజామాబాద్ అర్బన్ : సమగ్రంగా రికార్డుల నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందించడం, పారదర్శకత, సమయపాలన, పోలీసు వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమైన అంశాలని

దిశ, నిజామాబాద్ అర్బన్ : సమగ్రంగా రికార్డుల నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందించడం, పారదర్శకత, సమయపాలన, పోలీసు వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమైన అంశాలని పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య అన్నారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పలు అంశాలపై కమిషనరేట్ పరిధిలో కొత్తగా నియమితులైన పోలీస్ స్టేషన్స్ రైటర్స్ సిబ్బందికి నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం సీపీ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమంలో అన్ని అంశాలపై మెళకువలు నేర్చుకోవాలన్నారు. శిక్షణలో కేసు దర్యాప్తు పత్రాలు, ఎఫ్‌ఐఆర్ రిజిస్ట్రేషన్, సైబర్ క్రైమ్ రికార్డింగ్, రిపోర్టింగ్, ఆధునిక పోలీస్ డాక్యుమెంటేషన్ పద్ధతులపై పోలీస్ స్టేషన్ రైటర్స్ కు మార్గదర్శకాలు అందించబడతాయన్నారు. ఈ శిక్షణ పూర్తయిన తరువాత సిబ్బంది పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తరువాత తమ పై అధికారులకు ఈ శిక్షణ గురించి క్షుణ్ణంగా తెలియజేయాలని సీపీ తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో ఏవిధంగా మసలుకోవాలో, కేసులు నమోదైతే ఏ విధంగా సత్వర చర్యలు తీసుకోవాల, అలాంటి కేసుల్లో శాస్త్ర సాంకేతిక పద్ధతులు ఏ విధంగా ఉపయోగించాలో వాటన్నింటి గురించి తెలియజేయాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) గట్టు బస్వారెడ్డి , పోలీసు శిక్షణ కేంద్రం ఏసీపీ రాజశేఖర్, సీఐ శివరాం పాల్గొన్నారు.






