యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై శిక్షణ...

by Ratna Kumari |

దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మహిళా- శిశు- వయోవృద్ధుల

యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై శిక్షణ...
X

దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మహిళా- శిశు- వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహకారంతో AR ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఆర్మూర్ ప్రాజెక్ట్ పరిధిలోని ఆలూర్ మండలం లోగల ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కాలేజీలో యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్నం మాట్లాడుతూ లింగ వివక్షత నిర్మూలనకు యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. AR ఎడ్యుకేషన్ ట్రైనర్ శిరీష మాట్లాడుతూ సమాజంలో లింగ సమానత్వంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. బాలురు, బాలికల మధ్య సమాన హక్కులు, గౌరవం, మహిళలు బాలికలపై వివక్ష, హింస నివారణలో బాలుర పాత్రపై అవగాహన కల్పించారు. అలాగే బాల్యవివాహాలు, బాలలపై దుర్వినియోగం వంటి సామాజిక సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థులు, DHEW సిబ్బంది పుష్ప, కవిత, సౌమ్య, సునంద, ఐసీడీఎస్ సూపర్వైజర్ సమత పాల్గొన్నారు.

Next Story