- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరి తడపాకల్ పుణ్యక్షేత్రం వద్ద విషాదం
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండల పరిధిలోని తడపాకల్ గోదావరి పుణ్యక్షేత్రం వద్ద శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండల పరిధిలోని తడపాకల్ గోదావరి పుణ్యక్షేత్రం వద్ద శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. మొక్కు తీర్చుకోవడానికి కుటుంబంతో కలిసి వచ్చిన డిచ్పల్లి మండలం మెంట్ రాజ్ పల్లి గ్రామానికి చెందిన చిటికెల వినోద్ (37) అనే వ్యక్తి స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడికి 18 నెలల కూతురు ఉంది. ఈ ఘటన స్థానికంగా కంటతడి పెట్టించింది. అలాగే గతంలో అనేక మంది ఈ సంఘటన స్థలం వద్ద చనిపోయారు. ఇసుక మాఫియా ఇసుకను గుంతలుగా లోతుగా తవ్వడంతో అందులో నీరు చేరడంతో అలాగే తెలియని భక్తులు స్నానానికి దిగి చనిపోతున్నారు. ఇసుక మాఫియా దుశ్చర్యను ఆపేందుకు సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.






