- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్య నగర్ లో న్యూ ఇయర్ సమీపిస్తున్న వేళ విషాదం చోటుచేసుకుంది. ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల శ్రీరామ్ అనే బాలుడు ఆదివారం సాయంత్రం తన ఇంటి పై గాలిపటం ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటికి సమీపంలో ఉన్న విద్యుత్ వైర్లను పతంగితో ఉన్న మాంజా దారం తగలడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు.
దాంతో బంధువులు శ్రీరామ్ ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. కాగా కొత్త సంవత్సరం వేడుకలను అందరూ జరుపుకుంటూ ఉండగా బాలుడి కుటుంబంలో మాత్రం తీవ్ర విషాదాన్నే మిగిలించింది. 60 శాతం కు పైగా కాలిన గాయాలతో ఉన్న బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా తమ ఇంటికి సమీపంలో ఆనుకుని ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
Read MOre..






