- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్నించయ్యా... గణపయ్య
భారీ వర్షాల నేపథ్యలో గణపతి భక్తులకు ఊహించని షాక్ తగిలింది. వినాయక పండుగ రోజున గణపతి ప్రతిష్టన చేయలేకపోయిన ఘటన

దిశ, బీబీపేట: భారీ వర్షాల నేపథ్యలో గణపతి భక్తులకు ఊహించని షాక్ తగిలింది. వినాయక పండుగ రోజున గణపతి ప్రతిష్టన చేయలేకపోయిన ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ప్రతి ఏటా వనదుర్గ పెద్దమ్మ ఆలయం వద్ద భారీ లంబోదరుడి విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఆనవాయితీ. అక్కడి నుండే పండుగ రోజు బాజా భజంత్రీలు, సౌండ్ బాక్స్ లు పెట్టి, ఎవరి వినాయక విగ్రహాలను వారు పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకెళ్లి మండపాలలో ప్రతిష్టిస్తారు.
అయితే భారీ వర్షానికి రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న బ్రిడ్జికి ఇరువైపులా వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. రోడ్డు కూడా తెగిపోయింది. ఈ నేపథ్యంలోనే వినాయక విగ్రహాలను తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. దింతో గణపతి భక్తులకు షాక్ తగిలింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి తెచ్చుకున్న సుమారు 30 విగ్రహాలు, పూజలకు నోచుకోకుండా పెద్దమ్మ ఆలయంలోనే ఉన్నాయి.దింతో మన్నించయ్య... గణపయ్య... అంటూ మండపాల నిర్వాహకులు, గ్రామస్తులు వేడుకుంటున్నారు.






