రూ. 1.20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో పోసింది బీఆర్ఎస్ : టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‍ కుమార్ గౌడ్

by Ratna Kumari |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. 1.20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, తెలంగాణ ప్రజల సొత్తును కేసీఆర్ దుర్వినియోగం

రూ. 1.20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో పోసింది బీఆర్ఎస్ : టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‍ కుమార్ గౌడ్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. 1.20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, తెలంగాణ ప్రజల సొత్తును కేసీఆర్ దుర్వినియోగం చేశారని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియామకం జరిగిన తరువాత ఆయనకు గురువారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ భారీ ఎత్తున స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ సభనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకుంటోందని, అధికార పగ్గాలు చేపట్టాక 15 నెలల్లోనే రూ. 21 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకమని మహేశ్ గౌడ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ మాటిస్తే నిలబెట్టుకుంటుందన్నారు. జిల్లాలో తీరని కలగా మిగిలిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏడాదిలోనే మంజూరు చేయించి 35 ఏళ్ల నిరీక్షణకు టీపీసీసీ ప్రెసిడెంట్ గా తెర దించానని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. త్వరలోనే అగ్రికల్చర్ కళాశాల కూడా యూనివర్శిటీలో ఏర్పాటు కాబోతుందని ఆయన తెలిపారు. కరీంనగర్, ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రి గుట్ట నుంచి బాసర వరకు రూ. 350 కోట్లతో రోడ్డు మంజూరైందని ఆయనన్నారు. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వరకు రోడ్డు సదుపాయం త్వరలోనే అందించబోతున్నామని మహేశ్ తెలిపారు. భీమ్‍ గల్ లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆవరణలో టూరిజం గెస్ట్ హౌజ్ నిర్మాణం కోసం రూ. 4 కోట్ల నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజే జీఓ జారీ చేసిందన్నారు.

సుదర్శన్ రెడ్డి జిల్లాకు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు..

నిజామాబాద్ జిల్లాకు అనుభవ పూర్వకంగా, ఆలోచనా పరంగా సుదర్శన్ రెడ్డిది పెద్దన్న పాత్ర అని, ప్రజల సమస్యలను ఆయన తన సొంత సమస్యలుగా భావిస్తారని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు మాత్రమే కాదని, జిల్లాకు ఆయన మంత్రేనని ఆయనన్నారు. సుదర్శన్ రెడ్డి ఏదైనా పని మొదలు పెడితే దాన్ని అకుంఠిత దీక్ష, పట్టుదలతో పూర్తి చేస్తారని మహేశ్ గౌడ్ ప్రశంసించారు. ఆయనలోని ఈ ప్రత్యేకత, ఈ లక్షణమే ప్రజలకు ఆయనను మరింత దగ్గర చేస్తోందని మహేశ్ అన్నారు. వ్యాపార పరంగా, రాజకీయ పరంగా కూడా రాణించారని మహేశ్ అన్నారు.

జిల్లాకు మెడికల్ కళాశాల సుదర్శన్ రెడ్డి చలవే..

ఒకప్పుడు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమైన మెడికల్ కళాశాలను నిజామాబాద్ జిల్లాకు మంజూరు చేయించి తీసుకురావడంలో, నిజామాబాద్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటులో సుదర్శన్ రెడ్డిది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా జిల్లాకు 21, 22 వ ప్యాకేజీలు తీసుకురావడంలో సుదర్శన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని మహేశ్ అన్నారు. కెనాల్ ఆధునికీకరణ కోసం నిధులు తీసుకువచ్చిన ఘనత కూడా ఆయనదేనని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రాజెక్టుల ప్యాకేజీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అటకెక్కించిందని మహేశ్ ఆరోపించారు.

Next Story