- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డి సభతో బీజేపీ భరతం పడతాం
ఈనెల 15వ తేదీన కామారెడ్డి సభతో బీజేపీ భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కామారెడ్డి

దిశ, కామారెడ్డి టౌన్ : ఈనెల 15వ తేదీన కామారెడ్డి సభతో బీజేపీ భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదివారం శుభం ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కింది స్థాయి కార్యకర్తలు కష్టపడితేనే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం అన్నారు. బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో విద్యా ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదం పంపి గవర్నర్ కి పంపించామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల వల్లనే బీసీ బిల్లు ఆమోదం చేయకుండా ఆపుతున్నారని అన్నారు. బీసీ బిల్లు కోసం బిజెపి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.... రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సభ ద్వారా బిజెపి పై పోరాటం చేస్తామని, ఆనాడు రాష్ట్ర అధ్యక్షులుగా కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీచేసిన రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ సభ కామారెడ్డి లోని ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు అదే కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుకై బిజెపి పార్టీపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ కామారెడ్డి లో ఈనెల 15వ తేదీన బీసీ బిల్లు అమలుకై బహిరంగ సభ ఏర్పాటు చేసి బిజెపి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి గవర్నర్ పంపినట్లు పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణలో బీసీలు 56% ఉన్నారు,
వారికి న్యాయం చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో కామారెడ్డి నుండి పోటీ చేసి, బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందో అర్థం కావడం లేదని ఆగ్రహించారు. మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీల ప్రభావంతో బిజెపి పార్టీ కొట్టుకపోతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖ, మంత్రి వాకటి శ్రీహరి, ఎంపీ సురేష్ షెట్కర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, లక్ష్మీ కాంతారావు, మదన్ మోహన్ రావు, ఎడమ బొజ్జు, భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరు వెంకటి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, పార్టీ జనరల్ సెక్రెటరీ లు, తదితరులు పాల్గొన్నారు.






