- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడిసెల్లో నివసించే నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యత
గుడిసెల్లో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి తొలి ప్రాధాన్యత ఇస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.

దిశ, జుక్కల్ (నిజాంసాగర్) : గుడిసెల్లో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి తొలి ప్రాధాన్యత ఇస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్మాణ పనుల పురోగతిపై జుక్కల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, జిల్లా అదనపు కలెక్టర్ నిమ్మ వి. గిరి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణ దశకు అనుగుణంగా వివరాలు ప్రభుత్వ పోర్టల్‌లో సక్రమంగా నమోదు అయ్యాయో లేదో అధికారుల ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. నిర్మాణ పనులు ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ఇందిరమ్మ గృహ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు తొలి ప్రాధాన్యత కల్పించి గృహాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ నిమ్మ వి. గిరి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల వివరాల నమోదు, నిర్మాణ దశల అప్‌డేషన్‌లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రజా పండరి, శ్యామ్ అప్ప,సాయిలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






