నేటి బాలలే రేపటి దేశాభివృద్ధికి పునాదులు : ప్రిన్సిపాల్ నిర్మ‌ల జిమ్మీ

by Ratna Kumari |

దిశ, నాగిరెడ్డిపేట్ : నేటి బాలలే రేపటి దేశ అభివృద్ధికి పునాదులని కేరళ పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మల జిమ్మీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేరళ పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు

నేటి బాలలే రేపటి దేశాభివృద్ధికి పునాదులు : ప్రిన్సిపాల్ నిర్మ‌ల జిమ్మీ
X

దిశ, నాగిరెడ్డిపేట్ : నేటి బాలలే రేపటి దేశ అభివృద్ధికి పునాదులని కేరళ పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మల జిమ్మీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేరళ పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చాచా నెహ్రు వేషధారణ ధరించి చాచా నెహ్రూ జీవిత చరిత్ర గురించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవల గురించి, బాలల హక్కుల గురించి అవగాహన కల్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని 550 మంది విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మల జిమ్మీ పరీక్ష ప్యాడ్ లను ఉచితంగా వితరణ చేశారు. బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు ప్రశాంత్, ఉపాధ్యక్షురాలు స్వప్న లు హాజరయ్యారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మల జిమ్మి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story