- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాముకాటుతో మూడేళ్ల బాలిక మృతి
దిశ, బాన్సువాడ : పాముకాటుతో మూడేళ్ల బాలిక మృతి చెందిన సంఘటన బాన్సువాడ మండల పరిధిలోని పులిగుండు తండా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. పులిగుండు తండా గ్రామపంచాయతీ పరిధిలోని కాలు

దిశ, బాన్సువాడ : పాముకాటుతో మూడేళ్ల బాలిక మృతి చెందిన సంఘటన బాన్సువాడ మండల పరిధిలోని పులిగుండు తండా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. పులిగుండు తండా గ్రామపంచాయతీ పరిధిలోని కాలు నాయక్ తండాకు చెందిన చౌహన్ శ్రీకాంత్ కుమార్తె సరస్వతి(3). మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించింది. బుధవారం ఉదయం 6 గంటలకు నిద్రలేవగానే వాంతులు చేసుకుంది. అది గమనించిన తల్లిదండ్రులు ఆమె కుడి కాలుపై ఏదో గుర్తు తెలియని విషపురుగు కరిచినట్టు ఘాట్లు ఉండటంతో చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ డాక్టర్ పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించాలని సూచించడంతో నిజామాబాద్ కి తీసుకెళ్తుండగా మార్గమద్యలో దుర్కి గ్రామం వద్ద మరణించిందని బాలిక తండ్రి చౌహన్ శ్రీకాంత్ తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తుల శ్రీధర్ వెల్లడించారు.






