- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి వస్తుండగా కారు బోల్తా...
ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి వస్తుండగా సదాశివనగర్ మండలం కుప్రియాల్ స్టేజి వద్ద అదుపుతప్పి కారు బోల్తా పడింది.

X
దిశ, కామారెడ్డి : ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి వస్తుండగా సదాశివనగర్ మండలం కుప్రియాల్ స్టేజి వద్ద అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా గ్రామానికి చెందిన ఓ ఫ్యామిలీ రాత్రి కారులో ఎయిర్ పోర్టుకు వెళ్లారు. తిరిగి ఇంటికి బయలుదేరగా.. సదాశివనగర్ మండలం కుప్రియాల్ వద్దకు రాగానే కారు బోల్తా పడి రోడ్డు కిందకు వెళ్ళింది. ఈ ఘటనలో కారులో వెళ్తున్న కొమ్ము రాజేశ్వర్, రాజశేఖర్, జ్యోతి, రాజ్యలక్ష్మి లకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్సులో జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం సంభవించిందని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






