- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిషేధిత అల్ఫాజోలం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
నిషేధిత అల్ఫజోలాన్ని తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, కామారెడ్డి : నిషేధిత అల్ఫజోలాన్ని తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు మూడు లక్షల ఇరవై వేల రూపాయల విలువైన 253 గ్రాముల అల్ఫాజోలాన్ని, ఎనిమిది రకాల ముడి సరుకులను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్కా సమాచారం మేరకు బిచ్కుంద ఎస్సై తన సిబ్బందితో కలసి మద్నూర్ గ్రామం లోని ఉదాతలవర్ సురేష్ గౌడ్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో నిషేధిత మత్తు పదార్థం అయిన ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వెంటనే సురేష్ గౌడ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తాను అల్ఫ్రజోలమ్ ను హైదరాబాద్ లోని నాచారంలోని దినేష్ కుమార్ మొహంతి వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పాడన్నారు.
వెంటనే సురేష్ గౌడ్ తో సహ బిచ్కుంద యస్ఐ తన సిబ్బందితో కలిసి హైదరాబాద్ లోని నాచారం వద్ద గల టెంపుల్ ఆర్గానిక్ ల్యాబ్ వద్దకు వెళ్ళి దినేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా .. నిషేదిత అల్ఫ్రజోలమ్ ను కృష్ణ వద్ద కొని కొంత లాభంతో ఇతరులకు అమ్ముతానని బొడ్డు కృష్ణ అనే వ్యక్తిని కూడా చూపించాడన్నారు. తాను కృష్ణ వద్ద కొనుగోలు చేసిన అల్ఫ్రజోలమ్ ను మద్నూర్ లోని సురేష్ గౌడ్ తో పాటు.. శ్రీనివాస్ గౌడ్ కు వివిధ సందర్భాల్లో అమ్మినట్లు తెలిపాడన్నారు. అనంతరం బొడ్డు కృష్ణని అదుపులోకి తీసుకొని విచారించగ నాచారం లోని టెంపుల్ ఆర్గానిక్ ల్యాబ్ లో 8 రకాల ముడి సరకులను ఉపయోగించి ప్రభుత్వ నిషేధిత అల్ఫ్రజోలమ్ ను తయారు చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. అదే విధంగా తాను తయారు చేసిన అల్ఫ్రజోలమ్ ను దినేష్ అనే వ్యక్తికి తక్కవ ధరకు అమ్మగా.. పెద్ద మొత్తంలో లాభంతో అతడు ఇతరులకు అమ్ముతాడని తెలిపినట్లు చెప్పారు. చట్టప్రకారం పంచుల సమక్షంలో అట్టి నిషేదిత అల్ఫ్ప్రోజోమ్ ను స్వాధీనపర్చుకుని నేరస్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వివరించారు. జిల్లాలో నీషేదిత మత్తు పదార్థాలు కలిగి ఉన్నా, సరఫరా చేసినా, అమ్మినా వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






