- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురి అరెస్ట్
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ టౌన్ లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ ఫోర్స్ మెంట్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ముగ్గురినీ గురువారం అరెస్ట్ చేసారు.

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ టౌన్ లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ ఫోర్స్ మెంట్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ముగ్గురినీ గురువారం అరెస్ట్ చేసారు. ఆర్మూర్ లోని కోర్టులో డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ చేసిన ముగ్గురినీ హాజరు పరచగా.. ఇద్దరికీ ఒక్కొక్కరికీ పదివేల చొప్పున మొత్తం 2వేల జరిమానాను మరో వ్యక్తికి 3 రోజుల సాధారణ జైలు శిక్ష ను జెఎఫ్ సీఎం ఆర్మూర్ మేజిస్ట్రేట్ భవ్య శ్రీ విధించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. వాహనదారులు తమ వాహనాలను మద్యం సేవించి నడప రాదని, వాహన దారులకు మోటార్ వెహికల్ నూతన చట్ట ప్రకారం.. భారీగా జరిమాణాలు, జైలుశిక్షలు పెంచినట్లు, వాహనాల యొక్క ధ్రువపత్రాలను వాహన దారులు వారి వెంట దగ్గర ఉంచుకోవాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ సూచించారు.






