- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురు అరెస్ట్.. రూ.30వేలు జరిమానా
by Ratna Kumari |
ఆర్మూర్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్మూర్ లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ ఫోర్స్ మెంట్ నిర్వహించగా పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఆర్మూర్ ఎస్ హెచ్ఓ సత్య నారాయణ గౌడ్ శుక్రవారం తెలిపారు.

X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్మూర్ లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ ఫోర్స్ మెంట్ నిర్వహించగా పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఆర్మూర్ ఎస్ హెచ్ఓ సత్య నారాయణ గౌడ్ శుక్రవారం తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి అరెస్టయిన ముగ్గురు వ్యక్తులను ఆర్మూర్ లో కోర్టులో హాజరు పరచగా.. ఒక్కొక్కరికి 10 వేల చొప్పున ముగ్గురికి మొత్తం 30 వేల రూపాయల జరిమానాను జేఎఫ్ సీఎం న్యాయమూర్తి సరళ రాణి విధించినట్లు ఎస్హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. వాహనదారులు వారి వాహనాలను మద్యం సేవించి నడప రాదని, వాహనదారులకు మోటార్ వెహికల్ నూతన చట్ట ప్రకారం భారీగా జరిమాణాలు, జైలు శిక్షలు పెంచడం జరిగిందని, వాహనాల ధ్రువపత్రాలను వాహన దారులు వారి వెంట ఉంచుకోవాలన్నారు.
Next Story






