తాళం వేసిన ఇళ్లలో చోరీ...బంగారు ఆభరణాలు, నగదు అపహరణ

by Bhanu |

తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయిన సంఘటన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్కి నగర్ శివారులో చోటుచేసుకుంది.

తాళం వేసిన ఇళ్లలో చోరీ...బంగారు ఆభరణాలు, నగదు అపహరణ
X

దిశ, కామారెడ్డి : తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయిన సంఘటన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్కి నగర్ శివారులో చోటుచేసుకుంది. బాధితులు, దేవునిపల్లి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ లో పనిచేసే నీలం సాయినాథ్ కుటుంబంతో కలిసి తన ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన అడ్లూరుకు ఆదివారం రాత్రి వెళ్ళాడు. అలాగే ఇదే ఇంటిపైన పెంటయ్య అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి దైవ దర్శనానికి వెళ్ళాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు రెండిళ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. సాయినాథ్ ఇంట్లో సుమారు మూడుతులాలకు పైగా బంగారు ఆభరణాలు, 90 వేల రూపాయల నగదు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. పెంటయ్య ఇంట్లో కూడా బంగారు ఆభరణాలు అపహరణ కు గురైనట్లు తెలిపారు. అలాగే వీరి ఇళ్ల పక్కనే గల మరో కిరాణా షాపు తాళాలు పగలగొట్టి అందులో నుంచి కూడా నగదు చోరీ చేసినట్లుగా తెలిపారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.




Next Story