బంధువుల ఇంటికి వెళ్లి వ‌చ్చే స‌రికి భారీ చోరీ..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-05 06:13:59  IST  )

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో మంగళవారం భారీ చోరీ జ‌రిగిన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. దేవునిపల్లి శివారులోని మెడికల్ కళాశాల సమీపంలో గల వినాయక నగర్ లో చోరీ జరిగిన విషయం

బంధువుల ఇంటికి వెళ్లి వ‌చ్చే స‌రికి భారీ చోరీ..!
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో మంగళవారం భారీ చోరీ జ‌రిగిన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. దేవునిపల్లి శివారులోని మెడికల్ కళాశాల సమీపంలో గల వినాయక నగర్ లో చోరీ జరిగిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. కాలనీలో నివాసం ఉండే చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో ఏకంగా 6.5 తులాల బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలు, సుమారు రూ.2.5 లక్షల నగదు దుండగులు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లిన చంద్రమోహన్ కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్ రూంలో ఉన్న బీరువా తాళం పగులగొట్టి మంచంపై వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించి చోరీ జరిగిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో దేవునిపల్లి ఎస్సై భువనేశ్వర్ ఘటనాస్థలికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు, వివరాలు సేక‌రిస్తున్నారు.

Next Story