నిజాంసాగర్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

by Ratna Kumari |

నిజాంసాగర్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, సిలిండర్ ల కొరత ప్రచారాన్ని నమ్మి వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీరభద్ర హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ప్రభాకర్ తెలిపారు.

నిజాంసాగర్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, సిలిండర్ ల కొరత ప్రచారాన్ని నమ్మి వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీరభద్ర హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ప్రభాకర్ తెలిపారు. గత రెండు రోజులుగా సరఫరాలో తాత్కాలిక అంతరాయం ఏర్పడడంతో గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు. గురువారం 540 సిలిండర్లు ఏజెన్సీకి చేరడంతో పెండింగ్‌లో ఉన్న వినియోగదారులందరికీ గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఏజెన్సీలో తగినంత నిల్వ ఉన్నదని, రాబోయే రోజుల్లో కూడా సరఫరా సజావుగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సిలిండర్ల కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి అపోహలను నమ్మవద్దని వినియోగదారులకు ప్రభాకర్ సూచించారు. అవసరమైతే ముందస్తుగా బుకింగ్ చేసుకుని, సరైన సమయానికి సిలిండర్లు పొందాలని ఆయన కోరారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నామని, సేవల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.

Next Story