- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ఫక్కీలా చోరీ.. స్కూటీ డిక్కీలో పెట్టిన డబ్బులు క్షణాల్లో మాయం
దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో సినీ ఫక్కి మాదిరిగా చోరీ జరిగింది. ఓ మహిళా స్కూటీ డిక్కీ నుంచి రూ.1లక్ష 50వేలు అపహరించుకుపోయారు దొంగలు. వివరాల్లోకి వెళ్లితే..

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో సినీ ఫక్కి మాదిరిగా చోరీ జరిగింది. ఓ మహిళా స్కూటీ డిక్కీ నుంచి రూ.1లక్ష 50వేలు అపహరించుకుపోయారు దొంగలు. వివరాల్లోకి వెళ్లితే.. భాన్సువాడ మండలం బోర్లం క్యాంప్ కి చెందిన రాజేశ్వరి అనే మహిళా తమ అవసరం నిమిత్తం బాన్సువాడ కెనరా బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.1,50,000 లోన్ తీసుకుంది. ఆమె తీసుకున్న విషయం దొంగలకు ఎలా తెలిసిందో ఏమో కానీ ఆమెను దొంగలు వెంటాడారు. డబ్బులను రాజేశ్వరి స్కూటీ డిక్కీలో పెట్టింది. అయితే బస్టాండ్ సమీపంలో తాను పని చేస్తున్న ప్రైవేట్ హాస్టల్ వద్దకు వెళ్లి వచ్చే సరికి స్కూటీ డిక్కీలో ఉన్నన డబ్బులు దొంగలు ఎత్తుకెళ్లారు. వెంటనే రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు సీఐ అశోక్ తెలిపారు. ఈ మధ్య కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారని.. ఎవరైనా బ్యాంకు వద్ద నుంచి డబ్బులు తీసుకొచ్చేటప్పుడు ఎక్కడా ఆగకుండా ఇంటికి వెళ్లి తీసుకున్న డబ్బులను జాగ్రత్తగా భద్ర పరుచుకోవాలని సూచించారు.






