- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన బాలికల హాస్టల్లో చోరీ..!
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి చోరీకి పాల్పడ్డాడు. హాస్టల్ లో ఉన్న డిగ్రీ విద్యార్ధుల నాలుగు మొబైల్స్ చోరీకి గురయ్యాయి. రాత్రి 1 గంటల ప్రాంతంలో ఘటన జరగడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ.. చోరీ విషయంలో సిబ్బంది హస్తం ఉందని ఆరోపించారు. వాచ్ మెన్ కు ఫోన్ చేస్తే నిద్రలో ఉన్నట్టు కాకుండా మామూలుగానే ఇంటిదగ్గర ఉన్నానని గట్టిగా చెప్తున్నాడని తెలిపారు. హాస్టల్ లోకి వచ్చిన వ్యక్తి ఒక గదిలో రెండు ఫోన్లు తీసుకున్నప్పుడు తాము గమనించి అరిస్తే గదికి గొళ్ళెం పెట్టి ఇతర గదిలో మరొక రెండు ఫోన్లు చోరీ చేసుకుని పారిపోయాడన్నారు. హాస్టల్ లో ఉన్న నిచ్చెన రాత్రి కనిపించలేదని, ఈ విషయం వాచ్ మెన్ ను అడిగితే మేడమ్ తీసేయ్యమన్నారని చెప్పారని, వార్డెన్ కు ఫోన్ చేసి అడుగుతామంటే తానే తీసేశానని చెప్పాడని తెలిపారు. దీపావళికి ముందు కూడా ఇద్దరు వ్యక్తులు వచ్చారని భయంతో ఈ విషయాన్ని తాము బయటకు చెప్పలేకపోయామన్నారు. మెనూ కూడా సరిగా పాటించడం లేదని, రెండు నెలలుగా పప్పుతోనే భోజనం పెడుతున్నారని, తినేటప్పుడు కూడా సిబ్బంది తమపై నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు. మద్యం, కల్లు తాగి సిబ్బంది పని చేస్తారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు.






