- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల సంక్షేమానికి పెద్దపీట
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

దిశ, భిక్కనూరు : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంలో రూ.52 లక్షల వ్యయంతో చేపట్టనున్న మహిళా సమాఖ్య భవనం, రెండు అంగన్ వాడీ భవనాలు, సిమెంట్ రోడ్లు, వివిధ అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ని అంగన్ వాడీ కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల రహదారులను కూడా మెరుగుపరిచేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్, ఉప సర్పంచ్ దుంపల మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్, రామేశ్వర్ పల్లి ఉపసర్పంచ్ గొల్లపల్లి వినోద్ గౌడ్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ తాటిపాముల లింబాద్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందె దయాకర్ రెడ్డి, పి మహిపాల్ రెడ్డి, నీల అంజయ్య, మద్దూరి రవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.






