మామను హత్య చేసిన అల్లుడికి పదేళ్ల జైలు శిక్ష

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లాలో మామను చంపిన అల్లుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. నవీపేట్ మండలం అనంతగిరి గ్రామానికి చెందిన రాజేంధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన ఈ హత్య కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.

మామను హత్య చేసిన అల్లుడికి పదేళ్ల జైలు శిక్ష
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మామను చంపిన అల్లుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. నవీపేట్ మండలం అనంతగిరి గ్రామానికి చెందిన రాజేంధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన ఈ హత్య కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. రాజేందర్ పెద్దనాన్న బిల్మాసింగ్ తన కూతురు, అల్లుడు రాజేష్‌తో కలిసి తిమ్మసముద్రం ప్రాంతంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. కుటుంబంలో తరచూ జరుగుతున్న గొడవల నేపథ్యంలో, తన కుమార్తెను సక్రమంగా చూసుకోవాలని బిల్మాసింగ్ తన అల్లుడు రాజేష్‌కు సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 27, 2025 న మామా, అల్లుళ్ల మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఆగ్రహానికి లోనైన రాజేష్ సమీపంలో ఉన్న ఇటుకతో తన మామ బిల్మాసింగ్ తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో బిల్మాసింగ్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటన అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నవీపేట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బిల్మాసింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి కుమారుడైన రాజేందర్ ఫిర్యాదు మేరకు నవీపేట్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అధికారులు సంఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు సేకరించి నిందితుడు రాజేష్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. తదుపరి ఈ కేసు ఉమెన్స్ కోర్టులో విచారణకు రాగా, విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు బలంగా ఉండటంతో నిందితుడి నేరం కోర్టులో రుజువైంది.

ఈ కేసును విచారించిన మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డి. దుర్గాప్రసాద్ నిందితుడు రాజేష్‌కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితునికి శిక్ష పడడానికి కృషి చేసిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.నీరజ, బ్రీఫింగ్ ఆఫీసర్లు కే. శ్రీకాంత్, నవీపేట ఎస్ఐ. బి. శ్రీనివాస్ నార్త్ రూరల్ సీఐ. కే. వినయ్ ప్రస్తుతం ధర్పల్లి ఎస్ఐ కోర్టు లైజన్ ఆఫీసర్ టి. గోవింద్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు పీసీ రాజకుమార్, విమెన్ పీసీ సుప్రియ, పీసీ కే. చంద్రశేఖర్, పీసీ కే. గణేష్ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించి ప్రశంసించారు.

Next Story