- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీసీసీ పదవులకు దరఖాస్తుల ప్రక్రియ షురూ..!
by Ratna Kumari |
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి తెలిపారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం అవసరమైన ప్రక్రియలు చేపట్టడానికి ఏఐసీసీ నుంచి అబ్జర్వర్ గా కర్నాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్‌షద్ జిల్లాకు వచ్చినట్లు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన ఆధ్వర్యంలోనే జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి పొందాలనుకునే ఆశావహులు ఈనెల 12 వరకు తమ దరఖాస్తులను జిల్లా కాంగ్రెస్ భవన్ లో సమర్పించాలని ఆయన కోరారు.
Next Story






