ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన వ్య‌క్తిని ర‌క్షించిన పోలీసులు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : అతిగా మ‌ద్యం సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఓ వ్య‌క్తిని పోలీసులు ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న క‌మ్మ‌ర్ ప‌ల్లి మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే..

ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన వ్య‌క్తిని ర‌క్షించిన పోలీసులు
X

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : అతిగా మ‌ద్యం సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఓ వ్య‌క్తిని పోలీసులు ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న క‌మ్మ‌ర్ ప‌ల్లి మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. మండల కేంద్రం నుంచి ఉప్లూర్ గ్రామానికి వెళ్లే రహదారిలోని వరద కెనాల్ లో కమ్మర్ పల్లి గాంధీనగర్ లో నివాసముంటున్న సమీర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమయానికి సమీపంలో ఉన్న వ్యక్తి 100 కి ఫోన్ చేయడం ద్వారా పోలీసులు స‌కాలంలో సంఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని కాపాడారు. అనంతరం 108కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో 108 అందుబాటులో లేదు. ఇక‌ ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి సీరియస్ గా ఉండడంతో స్థానిక ప్రజలు 108 సర్వీస్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితున్ని పోలీసులు వాల్మీకి గౌడ్, గణపతి, సంతోష్ లు ఆసుప‌త్రికి త‌ర‌లించి కాపాడారు. దీంతో స్థానికులు పోలీసుల పై హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Next Story