- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలుడి హత్యకేసును చేధించిన పోలీసులు.. ఇంతకీ ఏమైందంటే..?
భిక్షాటనలో తనకన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తోందన్న అసూయ, అక్కసుతో ఓ భిచ్చగత్తే , మరో భిచ్చగత్తె కొడుకును దారుణంగా చంపిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

దిశప్రతినిధి, నిజామాబాద్ మార్చి31: భిక్షాటనలో తనకన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తోందన్న అసూయ, అక్కసుతో ఓ భిచ్చగత్తే , మరో భిచ్చగత్తె కొడుకును దారుణంగా చంపిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. మార్చి 27 న నగరంలో జరిగిన 14 నెలల బాలుడి హత్య కేసును నిజామాబాద్ పోలీసులు చేధించారు. హంతకులను పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య సోమవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రకటనలో సీపీ వెల్లడించిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
నిజామాబాద్ నగరంలో రంజాన్ సందర్భంగా భిక్షాటన చేసి డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనతో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా నయాబాదికి చెందిన కాశీనాథ్ కమలాబాయి తన ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుతో కలిసి మార్చి 27న (ఐదు రోజుల క్రితం) ఉదయం 10 గంటల సమయంలో బిలోలి నుండి నిజామాబాద్ నగరానికి వచ్చింది. కమలాబాయి తన పెద్ద కూతురు శివాని, చిన్న కూతురు రోజా, 14 నెలల వయసున్న చిన్న కొడుకు కైలాష్ నలుగరు కలిసి నిజామాబాద్ కు వచ్చారు. రాత్రి పూట తనపెద్ద కూతురు, చిన్న కూతురులిద్దరూ ఆర్టీసీ బస్టాండులో పడుకోగా.. కమలాబాయి తన చిన్న కొడుకు కైలాష్ ను తీసుకుని రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడే పడుకుంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో మెళకువ వచ్చి చూసేసరికి తన పక్కలో పడుకుని ఉన్న కొడుకు కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయిన కమలాబాయి అంతటా వెతికినా కొడుకు జాడ కనిపించలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని భావించి పోలీసులకు చేసింది. బాధితురాలు కమలాబాయి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీపీ సాయిచైతన్య ఆదేశాలతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తు బృందం ఈ కేసును పరిశోధించింది. ఈ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించారు. నేరస్తుల గురించి గాలించగా .. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో నిందితులు మాలపల్లి మసీద్ దగ్గర ముఖానికి మాస్కులు కట్టుకొని భిక్షాటన చేస్తుండగా.. పోలీసులు వారిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ నాందేడ్ జిల్లా ధర్మాబాద్ లోని సరస్వతీ నగర్ కుచెందిన తల్లీ కొడుకులు మాలబాయి బోస్లే (52), గోపాల్ బోస్లే (33) లుగా గుర్తించారు. వీరిద్దరు పండుగ సమయాల్లో భిక్షాటన చేస్తారని తెలిపారు. కమలాబాయి తన చిన్నకొడుకును పట్టుకుని తమకన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తోందని, ఇది మనసులో పెట్టుకుని ఆమె కొడుకును చంపినట్లు నిందితులిద్దరూ పోలీసు విచారణలో నేరాన్ని ఒప్పుకున్నారు.
కమలాబాయి గతంలో తన భర్త గంగాధర్ ను హత్య చేసిందని మాలాబాయి, ఆమె కొడుకు గోపాల్ లు పోలీసులకు వివరించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని కమలాబాయి కొడుకును కిడ్నాప్ చేసి.. ఉమెన్స్ కాలేజీ కాంపౌండ్ వాల్ కు కొట్టి, బండరాయితో తలపై మోది బాలుడిని హత్య చేసినట్లు నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించినట్లు సీపీ సాయిచైతన్య తన ప్రకటనలో పేర్కొన్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండుకు పంపినట్లు సీపీ తెలిపారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించి కేసును చేధించిన వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ బి.రఘుపతి, ఎస్ఐ రాజేశ్వర్, వన్ టౌన్ పీఎస్ కానిస్టేబుళ్లు గంగారాం, రాంబాబు, రవి, ఉమెన్ కానిస్టేబుల్ అనూషలను సీపీ సాయిచైతన్య ప్రత్యేకంగా అభినందించారు.






