- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బక్రీద్ పండుగ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్లలో పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్లలో పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. నిజామాబాద్ నగరంలోని ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సి రోడ్డు ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను కూడా సీపీ స్వయంగా పర్యవేక్షించారు.
ఈద్గాల పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు , ట్రాఫిక్ నియంత్రణ , పార్కింగ్ సదుపాయాలు , భక్తుల రాకపోకలు , సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పండుగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని , శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సీపీ ఆదేశించారు. ప్రజలు పరస్పర సహకారంతో పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్ , నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ , హోంగార్డ్ ఏసీపీ దీపక్ చంద్ర, బోధన్ ఏసీపీ శ్రీనివాస్






