దోపిడి కేసును చేదించిన పోలీసులు.. నిందితుల అరెస్టు

by Ratna Kumari |

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించి శుక్రవారం నిందితులను అరెస్ట్ చేసి నగదు, విదేశీ కరెన్సీ, మొబైల్ ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ట్లు కామారెడ్డి పట్టణ పోలీస్ సీఐ.సి. నరహరి తెలిపారు.

దోపిడి  కేసును చేదించిన పోలీసులు..  నిందితుల అరెస్టు
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించి శుక్రవారం నిందితులను అరెస్ట్ చేసి నగదు, విదేశీ కరెన్సీ, మొబైల్ ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ట్లు కామారెడ్డి పట్టణ పోలీస్ సీఐ.సి. నరహరి తెలిపారు. ఈనెల 18 న రాత్రి , లింగంపేట్ మండ లం మోతే గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రాజు రెడ్డి రాజు, తన బంధువు రంజిత్‌తో కలిసి, రేణుక ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉండగా.. రాత్రి 8 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు వారిని అడ్డగించి బెదిరించి దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ.4,000/- నగదు, ఆధార్ కార్డు, అతని బంధువు వద్ద ఉన్న 300 దుబాయ్ దిర్హమ్స్ దోచుకొన్నట్లు తెలిపారు. బెదిరించి రూ.1000యూపీఐ పేమెంట్ చేసుకున్నట్లు తెలిపారు.

సీసీ ఫుటేజీ సాంకేతిక ఆధారంగా.. విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 21న రాజీవ్ నగర్‌లోని డీలక్స్ బేకరీ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అందులో షేక్ సల్మాన్. మహ్మద్ మొయిజ్, బొంది లోకేష్,షేక్ షానవాజ్, ఒక బాల నేరస్తుడు మహమ్మద్ మజీద్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. విచారణలో నిందితులు తాము సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులు చేసి దోపిడీలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. దోచుకున్న వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి మొత్తం రూ.8,300/- నగదు, 300 దుబాయ్ దిర్హ మ్స్ 19 మొబైల్ ఫోన్లు, TS 23F 6835 నంబర్ గల హోండా యాక్టివా స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు నిరుద్యోగం, తక్కువ ఆదాయం సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గుంపుగా ఏర్పడి నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నా రు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించగా, బాల నేరస్తుడిని జువెనైల్ న్యాయ ప్రక్రియ ప్రకారం హాజరుపరచడం జరిగిందన్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Next Story