స్వ‌చ్ఛంద సంస్థ ముందుకొచ్చిన విష‌యం తెలియ‌దు : మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ ఇప్ప ఉమారాణి

by Ratna Kumari |

కామారెడ్డి పట్టణంలోని స్మశాన వాటికలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిన విషయం తమకు తెలియదని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు.

స్వ‌చ్ఛంద సంస్థ ముందుకొచ్చిన విష‌యం తెలియ‌దు :  మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ ఇప్ప ఉమారాణి
X

దిశ‌, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని స్మశాన వాటికలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిన విషయం తమకు తెలియదని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలోని హౌంసింగ్ బోర్డు, ఇందిరానగర్ కాలనీలచ శ్మ‌శాన వాటికల సందర్శనకు పార్టీలకతీతంగా అన్ని పార్టీల కౌన్సిలర్లతో కలిసి వెళ్ళామన్నారు. ఈ రెండు శ్మ‌శాన‌ వాటికలు పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయడానికి ఎలాంటి వసతులు కల్పించాలనే అంశాన్ని పరిశీలించడానికి మాత్రమే వెళ్లామన్నారు. శ్మ‌శాన వాటికల అభివృద్ధికి స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చిన విషయం బీజేపీ కౌన్సిలర్లు చెప్పేవరకు మాకు తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టు ఫిడ్ కో నిధుల ద్వారా రెండు శ్మ‌శాన వాటికల అభివృద్ధికి రూ.1.30 కోట్లు మంజూరయ్యాయన్నారు. వాటితో శ్మ‌శాన‌ వాటికల అభివృద్ధి కోసం డీపీఆర్ తయారు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా కామారెడ్డి పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. శ్మ‌శాన వాటికలు, పట్టణ అభివృద్ధికి దాతలు ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అంజద్, జావేద్, నాయకులు బాస్కర్ గౌడ్, కళ్లెం సత్యం, సిద్ధిఖ్, కాళ్ళ గణేష్, చిట్టిబాబు, మాజీద్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.

10కే రన్ పోస్టర్ల ఆవిష్కరణ

తెలంగాణ రన్నర్ సొసైటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం నిర్వహించనున్న 10 కే రన్ పోస్టర్లను మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి ఆవిష్కరించారు. వయసుతో భేదం లేకుండా అందరూ ఈ 10 కే రన్ లో పాల్గొనాలని కోరారు. వయస్సుల వారీగా రన్నింగ్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జోత్స్న తదితరులు పాల్గొన్నారు.

Next Story