- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్మికుల పోరాట ఫలితమే లేబర్ ఇన్సూరెన్స్ పెంపు
భవన నిర్మాణ కార్మికుల పోరాట ఫలితమే లేబర్ ఇన్సూరెన్స్ పెంపు అని....దీనిపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు దుబాస్

దిశ బాన్సువాడ : భవన నిర్మాణ కార్మికుల పోరాట ఫలితమే లేబర్ ఇన్సూరెన్స్ పెంపు అని....దీనిపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు దుబాస్ రాములు. తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టి.యు.సి. ఆధ్వర్యంలో శుక్రవారం బాన్సువాడ సి.పి.ఐ. పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ రాములు మాట్లాడుతూ... గత ఏడు సంవత్సరాల నుండి భవన నిర్మాణ కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ డబ్బులు పెంచాలని అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు.
సి.పి.ఐ. పార్టీ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకుపోవడం వలన ప్రభుత్వం స్పందించి పరిహారం పెంచిందని ఆయన తెలిపారు. సహజ మరణం కోసం ₹1.30 లక్షల నుంచి ₹2 లక్షల, ప్రమాదవశాత్తు మరణానికి ₹6.30 లక్షల నుంచి ₹10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పెంచారని రాములు పేర్కొన్నారు. ఈ విజయాన్ని భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, పోరాట శక్తి ఫలితం అని గుర్తించారు. ఈ సమావేశంలో చెన్నం గారి సురేష్,దర్శన్ మేస్త్రి,సాయిబాబా, హనుమాన్లు, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.






