బావపై బావమరిది కర్ర, కటింగ్ ప్లేయర్‌తో దాడి..

by Disha Web Desk 13 |
బావపై బావమరిది కర్ర, కటింగ్ ప్లేయర్‌తో దాడి..
X

దిశ, కామారెడ్డి రూరల్: బావపై బావమరిది కర్ర, కటింగ్ ప్లేయర్‌తో దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన సంగమేశ్వర్‌కు గత 6 సంవత్సరాల క్రితం రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత 40 రోజుల క్రితం భర్తతో గొడవపడి లావణ్య తన తల్లిగారు ఇళ్లయిన ఉప్పల్ వాయి గ్రామానికి వెళ్ళింది.

దీంతో లావణ్య ను తీసుకువచ్చేందుకు సంగమేశ్వర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ వాయి గ్రామానికి వెళ్ళాడు. అక్కడ గ్రామ పెద్ద మనుషుల మధ్య లావణ్యను తీసుకెళ్ళేందుకు సంగమేశ్వర్ సిద్ధమవ్వగా లావణ్య నిరాకరించింది. దీంతో సంగమేశ్వర్ తన బైకుపై తన పెద్దమ్మ నర్సవ్వ, చిన్న కుమార్తెను తీసుకుని ఉప్పల్ వాయి నుంచి లింగాపూర్ కు బయలుదేరాడు. ఈ క్రమంలో రామారెడ్డి మండలం రంగంపేట గ్రామ శివారులో బావమరిది నరేష్ కర్ర, కటింగ్ ప్లేర్ తో సంగమేశ్వర్ పై దాడి చేయడంతో బైక్ పై ఉన్న సంగమేశ్వర్ పెద్దమ్మ నర్సవ్వ, చిన్న కుమార్తెలు కింద పడ్డారు.

అనంతరం నరేష్ తన వెంట తెచ్చుకున్న కర్ర, కటింగ్ ప్లేర్ తో సంగమేశ్వర పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుగా వచ్చిన పెద్దమ్మ నర్సవ్వ పై సైతం నరేష్ దాడి చేసి గాయపరిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సంగమేశ్వర్, నర్సవ్వ లను కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story