- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య గొంతు కోసిన భర్త
దిశ : నాగిరెడ్డిపేట్ : కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను భర్త గొంతుకోసిన ఘటన శుక్రవారం సాయంత్రం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని

దిశ : నాగిరెడ్డిపేట్ : కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను భర్త గొంతుకోసిన ఘటన శుక్రవారం సాయంత్రం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చీనూర్ గ్రామానికి చెందిన తలారి నారాయణ తన భార్య రామవ్వ ల మధ్య జరిగిన గొడవ కారణంగా భార్య తలారి రామవ్వ ను కత్తితో గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడని ఎస్సై తెలిపారు. తలారి రామవ్వ గత సంవత్సరం తన భర్త నారాయణకు బంగారు మంగళసూత్రంతోపాటు, 60 వేల రూపాయల నగదును ఇచ్చిందని అయితే రామవ్వ తన భర్త నారాయణతో గొడవపడి వేర్వేరుగా ఉంటూ బ్రతుకుదేరువు నిమిత్తం రామవ్వ హైదరాబాద్ వెళ్లిందని తెలిపారు. రామవ్వ తాను ఇచ్చిన 60 వేల రూపాయలు, బంగారు మంగళ సూత్రం తనవి తనకు తిరిగి ఇవ్వాలని గత ఆరు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు భర్త నారాయణతో మాట్లాడి డబ్బులు, బంగారం ఇచ్చివేయాలని చెప్పి పంపించారన్నారు. అయినప్పటికీ నారాయణ డబ్బులు, బంగారం ఇవ్వకపోవడంతో రామవ్వ తిరిగి శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్ళడంతో, భర్త నారాయణ మళ్లీ పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళ్ళావని భార్యతో గొడవ పెట్టుకుని గోపాల్ పేట్ గ్రామంలోని చీనూర్ కు వెళ్లే రోడ్డులో రామవ్వ గొంతు కోశాడని తెలిపారు. సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన రామవ్వను 108 వాహనంలో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. భార్య గొంతు కోసిన భర్త నారాయణను అదుపులోకి తీసుకొని తరలించినట్లు తెలిపారు. బాధితురాలు రామవ్వ తల్లి లచ్చవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






