- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణ స్నేహితుడు చనిపోయాడని ఆత్మహత్య..!
by Ratna Kumari |
దిశ, భిక్కనూరు : సాధారణంగా స్నేహితులు కొంత మంది ప్రాణానికి ప్రాణం ఇస్తుంటారు. స్నేహితుడి కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడుతుంటారు. కానీ ఓ స్నేహితుడు

X
దిశ, భిక్కనూరు : సాధారణంగా స్నేహితులు కొంత మంది ప్రాణానికి ప్రాణం ఇస్తుంటారు. స్నేహితుడి కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడుతుంటారు. కానీ ఓ స్నేహితుడు మాత్రం తన స్నేహితుడు చనిపోయాడని తాను కూడా మరణించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గ్రామానికి చెందిన హరి భూమయ్య స్నేహితుడు మంగలి నర్సింహులు దీపావళి పండుగ వేళ కృష్ణ మందిర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలియగానే తన తోటి స్నేహితుడు భూమయ్య మనస్థాపానికి గురయ్యాడు. అతిగా మద్యం సేవించి పొలం వద్దకు వెళ్లి వస్తానని బయలుదేరాడు. తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. భార్య హరి గౌరవ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్ ఐ ఆంజనేయులు వెల్లడించారు.
Next Story






