- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
దిశ, భీమ్‍గల్ : గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైన సంఘటన భీమ్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, భీమ్‍గల్ : గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైన సంఘటన భీమ్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన ప్రకారం.. భీమ్‍గల్ నుంచి బాబాపూర్ కు వెళ్లే మెయిన్ రోడ్డులో ఉన్న ఓ కోకాషాప్ ముందర మంగళవారం డెడ్ బాడీ కనిపించడంతో షాపు యజమాని రాగి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమ్మరి దుకాణం నడుపుతున్న శ్రీనివాస్ పది రోజులుగా షాపు తెరవకుండా మూసి ఉంచారు. మంగళవారం షాపును తెరవడానికి రాగా.. షాపు ముందు డెడ్ బాడీని గుర్తించినట్లు శ్రీనివాస్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడు 20 రోజులుగా భిక్షాటన చేస్తూ షాపు ముందరే ఉండేవాడని షాపు యజమాని పోలీసులకు తెలిపారు. షాపు యజమాని రాగి రాహుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు ఎరుపు రంగు చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, ఒంటిపై ఆరెంజ్ కలర్ టవల్ కూడా వేసుకుని ఉన్‌నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తించిన వారు భీమ్‍గల్ ఎస్ ఐ ఫోన్ నెం. 8712659866, పోలీస్ స్టేషన్ నెం. 8712659766 లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్ ఐ కోరారు.






