ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

by Ratna Kumari |   (  Updated:2026-03-19 10:03:51  IST  )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని టీపీసీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌ఫీయొద్దీన్ అన్నారు.

ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
X

దిశ,​ లింగంపేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని టీపీసీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌ఫీయొద్దీన్ అన్నారు. గురువారం లింగంపేట్ మండల కేంద్రంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహ‌న్ రావు ఆదేశాల మేరకు ముస్లిం సోదరులకు ఆయ‌న‌ రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా రఫీయొద్దీన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మైనారిటీల పక్షపాతి అని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల వల్ల నేడు ఎంతోమంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగ రంగాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. సబ్బండ వర్గాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.​ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నేతృత్వంలో నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ మండల అధ్యక్షులు బుర్ర నరగౌడ్, సర్పంచ్ రవీందర్,ఉపసర్పంచ్ ప్రసాద్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఎదుల్, కమిటీ అధ్యక్షులు ఫరూక్, అర్షద్, అదనాన్, మహేష్ గౌడ్, ఎమ్మార్వో సురేష్, ఎంపీడీఓ నరేష్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Next Story