- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శీతాకాలపు సవాల్...వణుకుతున్నా వదలకుండా..!
దిశ, తాడ్వాయి : మండలంలో చలి పంజా రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. గత మూడు రోజులుగా గజగజలాడించే చలి మధ్య రాత్రిపూట గస్తీ నిర్వహించడం పోలీసులకు నిజంగా ఓ పెద్ద సవాల్ అనే చెప్పాలి. అయినప్పటికీ

దిశ, తాడ్వాయి : మండలంలో చలి పంజా రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. గత మూడు రోజులుగా గజగజలాడించే చలి మధ్య రాత్రిపూట గస్తీ నిర్వహించడం పోలీసులకు నిజంగా ఓ పెద్ద సవాల్ అనే చెప్పాలి. అయినప్పటికీ ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ,తాడ్వాయి పోలీసులు తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. వారి ఈ అలుపెరగని సేవ చూసి స్థానికులు వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
చలి ఒకవైపు... అప్రమత్తత మరోవైపు
ప్రస్తుతం తాడ్వాయి ప్రాంతంలో 8 గంటలకే ఇంటికి పరిమితం అవుతున్నారు.అలాంటిది అర్ధరాత్రి దాటితే చలి తీవ్రత తారస్థాయికి చేరుతుండడంతో చలి కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.ఈ సమయంలోనే దొంగలు,నేరగాళ్లు తమ కార్యకలాపాలను పెంచే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టిన తాడ్వాయి పోలీసు సిబ్బంది... వ్యక్తిగత ఇబ్బందులను పక్కనపెట్టి, చలిని తట్టుకుంటూ ప్రధాన కూడళ్లు, గ్రామీణ ప్రాంతాలు, ఏటీఎం కేంద్రాల వద్ద తమ గస్తీని కొనసాగిస్తున్నారు.
ప్రజల కోసమే ఈ దీక్ష
తాడ్వాయి పోలీసు స్టేషన్ పరిధిలోని సిబ్బంది, ప్రతి రాత్రి షిఫ్టుల వారీగా విధుల్లో పాల్గొంటున్నారు.గంటల తరబడి చలిలో రోడ్లపై గస్తి చేస్తూ తనిఖీలను నిర్వహించడం,అనుమానాస్పద వ్యక్తులు కనబడితే ప్రశ్నించడం,వాహనాలను పరిశీలించడం వంటి పనులను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పోలీసుల ఈ కృషి కారణంగా నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.అంత చలిలో కూడా మా భద్రత కోసం వాళ్లు నిలబడటం గొప్ప విషయం.వారికి మా గౌరవం, హ్యాట్సాఫ్ అని చుసిన స్థానికులు పోలీసులను ఉద్దేశించి అన్నారు.






