- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు- బస్సు ఢీ
by Ratna Kumari |
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న షకీల్ అబ్దుల్ అనే వ్యక్తి తన కారులో ప్రయాణిస్తుండగా.. ఎదురుగా నిజామాబాద్ వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగం లో ఢీ కొట్టింది. మొదటగా బస్సు ఒక స్కూటీని ఢీ కొట్టగా, అనంతరం ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో షకీల్ అబ్దుల్‌కు కాలు, చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన కారు తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






