- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రమేష్ గౌడ్ పై ఆరోపణలు సరికాదు
బహుజన బిడ్డ పల్లె రమేష్ గౌడ్ పై కొంత మంది తమ స్వార్థం కోసం ఆరోపణలు చేస్తూ పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే దళిత, బహుజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని దళిత, బహుజన సంఘాల నాయకులు హెచ్చరించారు.

దిశ, కామారెడ్డి : బహుజన బిడ్డ పల్లె రమేష్ గౌడ్ పై కొంత మంది తమ స్వార్థం కోసం ఆరోపణలు చేస్తూ పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే దళిత, బహుజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని దళిత, బహుజన సంఘాల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ ప్రజా సేవకుడు అని, అతడు దళితులను అవమానించే వ్యక్తి కాదన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై కొంత మంది తప్పుడు ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు.
ఆయనపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే వారి గ్రామంలో మాట్లాడుకోవాలి తప్ప ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తనతో రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే గ్రామంలో చూసుకోవాలే తప్ప కొంత మందిని ఉసిగొలిపి ఇలా కేసులు పెట్టించడం తగదని ఫరీద్ పేట గ్రామ సర్పంచ్ నరసింహ రెడ్డికి సూచించారు. గ్రామంలో ప్రతీ యేటా జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో దళితులను ప్రత్యేకంగా పిలిచి బట్టలు పెట్టి పూజలో కూర్చుండబెట్టిన రమేష్ గౌడ్ పైన దళితులను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రమేష్ గౌడ్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో దళిత, బహుజన సంఘాల నాయకులు దేవుళ్ళ రాములు, బైండ్ల రామస్వామి, విష్ణు, లక్ష్మీనర్సు, భూమవ్వ, కొంగల లక్ష్మి, రాజమణి, వరలక్ష్మి, తగిరంచ రాజిరెడ్డి, పెరుమాండ్ల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.






