నీటిలో మునిగిపోతున్న భ‌క్తుడిని కాపాడిన కానిస్టేబుల్

by Ratna Kumari |

మౌని అమావాస్య పర్వదినం వేళ నిజాంసాగర్ మండలంలో ఒక కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు.

నీటిలో మునిగిపోతున్న భ‌క్తుడిని కాపాడిన కానిస్టేబుల్
X

దిశ,​ నిజాంసాగర్ : మౌని అమావాస్య పర్వదినం వేళ నిజాంసాగర్ మండలంలో ఒక కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. నీటిలో మునిగిపోతున్న భక్తుడిని ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే...ఆదివారం మౌని అమావాస్య సందర్భంగా మంజీరా నది పరివాహక ప్రాంతమైన నాగమడుగు వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలానికి చెందిన మల్లేష్ అనే భక్తుడు పుణ్యస్నానం ఆచరించేందుకు నదిలోకి దిగారు. అదుపుతప్పి నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో ఆయన మునిగిపోవడంతో గమనించిన కానిస్టేబుల్ ఒడ్డుకు చేర్చాడు. సమయస్ఫూర్తి చూపిన కానిస్టేబుల్ అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శ్యామ్ వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని గమనించిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకి, మునిగిపోతున్న మల్లేష్‌ను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. దీంతో సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్యామ్‌ను స్థానికులు,భక్తులు ఆకాశానికెత్తారు. ఆయన సాహసాన్ని చూసి తోటి పోలీసులు, అధికారులు అభినందించారు.

Next Story