- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కులం పేరుతో దూషించిన నిందితునికి పదేళ్ల జైలు శిక్ష
కులం పేరుతో దూషించి హత్యాయత్నం చేసిన కేసులో నిందితునికి కోర్టు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

దిశ, కామారెడ్డి : కులం పేరుతో దూషించి హత్యాయత్నం చేసిన కేసులో నిందితునికి కోర్టు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి పట్టణానికి చెందిన సర్కిల్ చంద్రశేఖర్ అనే వ్యక్తి మున్సిపల్ లో పని చేస్తున్నాడు. అతనికి పరిచయం అయిన ఇందిరానగర్ కు చెందిన షేక్ దావూద్ 8-02-2021 న మధ్యాహ్నం సుమారు 12.00 గంటల సమయంలో చంద్రశేఖర్ హరిజనవాడకు వెళ్తుండగా.. మార్గ మధ్యలో నిందితుడు షేక్ దావూద్ మందు తాగాలని ఒత్తిడి చేసి అజంపురా సెంటర్‌కు తీసుకెళ్లి డబ్బులు ఇవ్వమని అడిగాడు. డబ్బులు లేవని చెప్పినప్పటికీ, బాధితుడి వద్ద ఉన్న సుమారు రూ.1,500 గమనించి ఆ డబ్బులు బలవంతంగా గుంజుకొని, అనంతరం కులం పేరుతో దూషిస్తూ కంకర రాయితో తల, ముఖంపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో గాయపడిన చంద్రశేఖర్‌ను వెంటనే గాంధీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఈ విషయమై ఫిర్యాదు దారుడు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, చుట్టుపక్కల వారిని విచారించి, సరైన సాక్ష్యాలను సేకరించి నిందితుడు షేక్ దావూద్ ను అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసులో సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం, కులం పేరుతో దూషించి హత్యాయత్నం నేరం రుజువవడంతో, నిజామాబాద్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ (ఎస్సీ, ఎస్టీ కోర్టు) టి.శ్రీనివాస్ నిందితునికి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారన్నారు.






