- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అంటేనే త్యాగం
తెలంగాణ అంటేనే త్యాగం అని తెలంగాణ విమోచన కోసం ఎందరో మహనీయుల త్యాగఫలం వల్లనే రాచరికపు పాలన నుండి విముక్తి పొందామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు.

తెలంగాణ అంటేనే త్యాగం
- ఎందరో మహనీయుల త్యాగఫలంతోనే రాచరికపు పాలన నుంచి విముక్తి
- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
- సాయుధ పోరాట అమరవీరులకు ఎమ్మెల్యే నివాళి..
దిశ, జుక్కల్ (నిజాంసాగర్) : తెలంగాణ అంటేనే త్యాగం అని తెలంగాణ విమోచన కోసం ఎందరో మహనీయుల త్యాగఫలం వల్లనే రాచరికపు పాలన నుండి విముక్తి పొందామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత యూనియన్‌లో తెలంగాణ విలీనమైన శుభదినాన్ని ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన అని అన్నారు. ఇది నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగం,ఆనాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగు నాయక్, సాయ గౌడ్, రాములు సెట్, సతీష్ పటేల్,రాజులు సెట్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






