- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలంగాణ మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రత్యేక రాష్ట్రం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మంగళవారం నగరంలోని కంఠేశ్వర్ చౌరస్తాలో ప్రొఫెసర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రఖ్యాతి పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విద్యావంతుడు, మేధావి, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా తెలంగాణ సమాజానికి ఎంతగానో సేవలందించారాని గుర్తు చేశరాు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన ఎన్నో కలలు కన్నారని, తన జీవితాన్నే త్యాగం చేసారని తెలిపారు. ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతో నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతాయని ఉద్భోధించారని అన్నారు. పరాయి వాడి పాలనలో మనం బానిసలాగా బతుకుడేందని అందరిలో చైతన్య దీప్తిని రగిలించారని గుర్తు చేశారని సూర్య నారాయణ గుప్త అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.