- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల బలిదానంతో తెలంగాణ వచ్చింది : ఏబీవీపీ
తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల బలిదానంతో ఏర్పడిందని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటివరకు సరైన సమయంలో స్కాలర్ షిప్ రాక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు అని పేర్కొన్నారు.

దిశ, కామారెడ్డి టౌన్ : తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల బలిదానంతో ఏర్పడిందని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటివరకు సరైన సమయంలో స్కాలర్ షిప్ రాక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు అని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి బస చేసే ప్రయత్నం చేశారు. కలెక్టర్ కార్యాలయం గేటు మూసి ఉండడంతో గేటు ముందు రహదారి పక్కన పడుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఏబీవీపీ నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. రాత్రిపూట ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ఉదయం వచ్చి ధర్నా చేసుకోవచ్చని పోలీసులు సూచించిన వినకపోవడంతో పోలీసులు అరెస్టు చేసి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ చరణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల బలిదానంతో తెలంగాణ వచ్చిందని 2014 నుంచి ఇప్పటివరకు సరైన సమయంలో స్కాలర్షిప్ రాక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. కామారెడ్డి లో 25 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వారి కోసం పాలిటెక్నిక్ ఇతర కళాశాలల కోసం ప్రశ్నించారా అని నిలదీశారు. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు రూ.8 వేల కోట్లు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రేవంత్ రెడ్డి వస్తే రూ. 4 వేల కోట్లకు తగ్గుతుందనుకుంటే మరొక వెయ్యి కోట్లు పెరిగిందన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు క్యాటరింగ్ కి వెళ్లే పనిచేసి అలా వచ్చిన డబ్బులతో కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. చదువుకోవాల్సిన వయసులో పని చేయడం వలన వారు పనిలో నిమగ్నమై చదువుకు దూరం అవుతున్నారు అని అన్నారు. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో చనిపోతే సీఎం మాట్లాడడం లేదన్నారు రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఇవాళ కామారెడ్డిలో రాత్రి నిద్ర చేపట్టాం రేపు సీఎంను బయటకు లాక్కొని వస్తామని హెచ్చరించారు. సీఎం ఏనాడైనా విద్యాశాఖలో నెలకొన్న సమస్యలపై మాట్లాడారా అని నిలదీశారు. మంత్రుల్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరా..? సీఎం దగ్గర విద్యాశాఖ ఎందుకు పెట్టుకున్నారని ఏబీవీపీ విమర్శించారు. కామారెడ్డి లో ఉన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా ఎక్కడైనా విద్యార్థుల సమస్యల మీద ఎక్కడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా మాట్లాడక పోతే కామారెడ్డికి రానివ్వమని ఇదొక హెచ్చరికల భావించాలని పేర్కొన్నారు.






