- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని డ్రైవ్ చేయాలి
వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు.

దిశ, భిక్కనూరు : వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం "అరైవ్- అలైవ్ " కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలకు గురై విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని, ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ రూల్స్ ను తప్పక పాటించాలన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి వివరాలను తెలియజేస్తూ, ఆ కుటుంబాలు పడుతున్న కష్టాల గురించి ఈ సందర్భంగా ఆమె వివరించారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్ ఐ ఆంజనేయులు ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ వాణి శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.






