ఎన్నికల విధులకు గైర్హాజరైన హెడ్మాస్టర్ సస్పెన్షన్

by Ratna Kumari |

ఎన్నికల విధులకు గైర్హాజరైన ఆర్మూర్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల విధులకు గైర్హాజరైన హెడ్మాస్టర్  సస్పెన్షన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికల విధులకు గైర్హాజరైన ఆర్మూర్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్మూర్ లోని 4, 5, 6 వార్డుల ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ) గా హెచ్.ఎం వనజా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల విధులకు గైర్హాజర్ కావడాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, సదరు ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story