- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలి
ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి అన్నారు.

దిశ, నిజాంసాగర్ : ప్రభుత్వ వసతి గృహాలల్లో ఉంటున్న విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి అన్నారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు నిజాంసాగర్ మండలం అచ్చంపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని శనివారం మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి ఆకస్మికంగా సందర్శించి పలు అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. అలాగే నిల్వల రిజిస్టర్‌లో నమోదు చేసిన సరుకులను అక్కడ ఉన్న వాస్తవ నిల్వలతో పోల్చి పరిశీలించారు. హాస్టల్‌లోని మరుగుదొడ్లు, వంటగది, విద్యార్థుల గదులు మరియు ఇతర వసతులను పరిశీలించి పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు సక్రమంగా అందేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. హాస్టల్‌లో విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు పోషకాహారంతో కూడిన భోజనం మెనూ ప్రకారం సమయానికి అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి చదువులో మంచి ప్రతిభ కనబరచేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని అన్నారు. హాస్టల్ వార్డెన్ విఠల్ విద్యార్థులను తమ సొంత పిల్లలలాగా చూసుకుంటూ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని ప్రశంసించారు. హాస్టల్ నిర్వహణ సక్రమంగా ఉండటం పట్ల ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ను విఠల్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.






