- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకుల పాఠశాల అన్నంలో పురుగులు.. విద్యార్థినుల రాస్తారోకో
ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు వడ్డిస్తున్న అన్నంలో తరచూ పురుగులు వస్తున్నాయని

దిశ : నాగిరెడ్డిపేట్ : ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు వడ్డిస్తున్న అన్నంలో తరచూ పురుగులు వస్తున్నాయని ఉపాధ్యాయులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో విసుగెత్తిన విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో గత కొన్ని రోజులుగా విద్యార్థినీలకు తాము తినే అన్నంలో పురుగులు వస్తున్నాయి. పురుగుల అన్నం తిన్న విద్యార్థినీలు అనారోగ్యానికి గురవుతున్నారు.అన్నంలో తరచూ పురుగులు వస్తున్న విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయినీలకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వివరించడంతో విసిగి వేసారి నా విద్యార్థినిలు సోమవారం పాఠశాల సమీపంలోని ఎల్లారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినీలు మాట్లాడుతూ గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న తాము తింటున్న అన్నంలో తరచుగా పురుగులు వస్తున్నాయని ఈ విషయంపై పలుమార్లు ప్రిన్సిపాల్, అధ్యాపకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడంలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నంలో పురుగులు వచ్చిన ఉపాధ్యాయునీయులు స్పందించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తాము రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. విద్యార్థినీలు రాస్తారోకో చేపడుతున్న స్థలానికి తహశీల్దార్ ప్రేమ్ కుమార్ వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినీలు రాస్తారోకో ను విరమించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్
పాఠశాలలో విద్యార్థినిలు తినే అన్నంలో పురుగులు రావడంతో రాస్తారోకో చేపట్టిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గిరిజన గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినిలతో మాట్లాడారు. పాఠశాలలోని డైనింగ్ హాల్, స్టాక్ రూమ్, వాష్ రూమ్ లను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని, త్వరితగతిన విద్యార్థినిల సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థినిలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్, ఎంఈఓ రాజులు తదితరులున్నారు.






