- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు దేశ భవిష్యత్ కి పునాది : టీయూవీసీ ఆచార్య టి. యాదగిరిరావు
దేశ భవిత, అభివృద్ధి, విద్యార్థుల ఎదుగుదలపై మాత్రమే ఆధారపడి ఉన్నాయని తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య టి. యాదగిరి రావు అన్నారు.

దిశ, డిచ్ పల్లి : దేశ భవిత, అభివృద్ధి, విద్యార్థుల ఎదుగుదలపై మాత్రమే ఆధారపడి ఉన్నాయని తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య టి. యాదగిరి రావు అన్నారు. యూనివర్శిటీలో బుధవారం జరిగిన విశ్వవిద్యాలయ వార్షికోత్సవ ఉత్సవాలకు చీఫ్ పాట్రన్ గా హాజరైన వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు విద్యతోపాటు పోటీ పరీక్షలు ఎదుర్కొనడంలో కావలసిన సమాచారాన్ని సేకరించి ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడాలన్నారు. విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొని మీమీ కుటుంబాలకు, ఈ దేశానికి గర్వకారణంగా నిలవాలని ఉద్ఘాటించారు.
వర్శిటీ రిజిస్ట్రార్ ఎం. యాదగిరి మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఎదురయ్యే సవాళ్లను మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు. విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకలింపు చేసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్సీ ప్రజావాగ్గేయకారుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న అన్నారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ ఆక్టివిటీస్ డైరెక్టర్ ఆచార్య కె. లావణ్య యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. రాంబాబు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ ఆరతి యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. ప్రసన్న రాణి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కన్వీనర్ డాక్టర్ జి బాలకిషన్ పాల్గొన్నారు.






